నెల్లూరు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న (25), చిట్టమూరుకు చెందిన యాకసిరి సావిత్రి (24) సోషల్ మీడియా ద్వారా పరిచయమై ప్రేమించుకున్నారు. రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద పురుగుల మందు డబ్బా దొరకడంతో, దానిని తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. సావిత్రికి ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.