ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ ఆసియా క్రీడల బాక్సింగ్‌లో మరో పతకాన్ని ఖాయం చేసుకుంది. 75 కేజీల విభాగంలో సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన సియోంగ్ సుయోన్‌ను 5-0 తేడాతో ఓడించింది. దీంతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన లవ్లీనా.. ఆసియా క్రీడల్లో వరుసగా రెండో పతకాన్ని ఖాయం చేసుకుంది. తాజా విజయంతో ఆమె కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.