NEET లో తక్కువ మార్కులు.. 16వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

48చూసినవారు
NEET లో తక్కువ మార్కులు.. 16వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ-ఎగ్జామ్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో హరియాణాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పరీక్షలో ఆశించిన మార్కులు రాలేదనే మనస్తాపంతో, మానసిక ఒత్తిడికి గురైన ఓ విద్యార్థిని, ఫరీదాబాద్‌లోని తమ అపార్ట్‌మెంట్ 16వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో మృతి చెందిన ధన్విత, విజయవాడకు చెందిన కుటుంబానికి చెందినది. చిన్నప్పటి నుంచి చదువులో రాణించిన ఆమె, డాక్టర్ కావాలనే లక్ష్యంతో నీట్ రీ-ఎగ్జామ్‌కు హాజరైంది.

సంబంధిత పోస్ట్