
గాంధీ జయంతి నాడు జోరుగా మద్యం విక్రయాలు (వీడియో)
AP: గాంధీ జయంతి నాడు రాష్ట్రంలో జోరుగా మద్యం విక్రయాలు జరిగాయి. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో వ్యాపారులు అక్రమంగా మద్యం విక్రయాలు చేశారు. చెట్ల తొర్రల్లో మద్యం బాటిళ్లు దాచి, నడిరోడ్డుపై రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. డ్రై డే నిబంధనలు అమల్లో ఉన్నా మద్యం బయటకు రావడం అధికారుల పర్యవేక్షణ లోపానికి అద్దం పడుతోంది.




