ముగిసిన ఎల్పీజీ e-KYC గడువు.. సిలిండర్, సబ్సిడీపై ఆందోళన

10174చూసినవారు
ముగిసిన ఎల్పీజీ e-KYC గడువు.. సిలిండర్, సబ్సిడీపై ఆందోళన
ఎల్పీజీ e-KYC పూర్తి చేయడానికి గడువు ఈ నెల 23తో ముగిసింది. సాంకేతిక సమస్యలు, వివరాల సవరణలో ఇబ్బందుల కారణంగా చాలా మంది వినియోగదారులు ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. దీంతో గ్యాస్ సిలిండర్ సరఫరా, LPG సబ్సిడీపై ఆందోళన నెలకొంది. వెంటనే కనెక్షన్ నిలిపివేస్తారని అధికారిక ప్రకటన లేనప్పటికీ, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా e-KYC పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. వినియోగదారులు తమ e-KYC స్టేటస్‌ను చెక్ చేసుకుని, అధికారిక మార్గాల ద్వారానే ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్