చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఖాళీగా దర్శనమిస్తున్న తిరుమల అలిపిరి (వీడియో)

58చూసినవారు
చంద్రగ్రహణం కారణంగా మంగళవారం నాడు తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. నిత్యం రద్దీగా ఉండే అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం ఖాళీగా దర్శనమిచ్చింది. ఆగమ శాస్త్రం ప్రకారం.. గ్రహణానికి ఆరు గంటల ముందు నుంచే ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. రాత్రి 8.30 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్