మంగళవారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. మ. 3.20 గంటలకు ప్రారంభమై సా. 6.47 గంటలకు ముగిసే ఈ గ్రహణం, తెలుగు రాష్ట్రాల్లో సా. 6.22 గంటలకు చంద్రుడు ఉదయించిన తర్వాత కేవలం 25 నిమిషాల పాటు పాక్షికంగా కనిపించనుంది. పండితుల సూచనల మేరకు, కంటికి కనిపించకపోయినా మ. 3.20 గంటలకు పట్టు స్నానం, సా. 6.47 గంటల తర్వాత విడుపు స్నానం చేయాలి. గ్రహణం ముగిసిన తర్వాత తలస్నానం, ఇంటిని శుభ్రం చేసుకోవడం, దానం చేయడం వంటివి చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోయి, ఇంట్లో పవిత్ర శక్తి పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.