ఓటీటీలో విడుదలకు సిద్ధమైన 'మదరాసి'

21133చూసినవారు
ఓటీటీలో విడుదలకు సిద్ధమైన 'మదరాసి'
శివకార్తికేయన్, రుక్మిణి వసంత్ నటించిన 'మదరాసి' చిత్రం, సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఈ సినిమా, థియేటర్లలో విడుదలైన నెల రోజులు కూడా కాకుండానే అక్టోబర్ 1వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. శివకార్తికేయన్ స్వయంగా ఓటీటీ విడుదల తేదీని ప్రకటించారు. సుమారు రూ. 150-200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా, 18 రోజుల్లో భారతదేశంలో రూ. 61.86 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 97.69 కోట్లు వసూలు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్