
అమెరికాలో జనవరి నుంచి 85 వేల విసాలు రద్దు
అమెరికాలో జనవరి నుంచి 85,000 వీసాలు రద్దు చేయనున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. 'మేక్ అమెరికా సేఫ్ ఎగైన్' అని X వేదికగా పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో దీనికి కట్టుబడి ఉన్నారని తెలిపింది. ట్రంప్ హయాంలోని అక్కడి ప్రభుత్వం వలసలు, సరిహద్దు భద్రతపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కఠిన చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే.




