రాజమౌళి దేవుడిని నిందించడం సరికాదు: మాధవీలత

11083చూసినవారు
రాజమౌళి దేవుడిని నిందించడం సరికాదు: మాధవీలత
దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలపై బీజేపీ నేత మాధవీలత తీవ్రంగా స్పందించారు. సినిమా వీడియో ప్లే కాకపోతే దానికి టెక్నికల్ కారణాలుంటాయని, దేవుడిని నిందించడం సరికాదన్నారు. 'బాహుబలి' సినిమా ద్వారా శివుడిని వాడుకుని డబ్బు సంపాదించారని, ఆ తర్వాత ఏ శివాలయానికైనా వెళ్లి దానధర్మాలు చేశారా అని ప్రశ్నించారు. సినిమా రాజమౌళికి వృత్తి అయినప్పుడు, ఆ వృత్తిని గౌరవించాలన్నారు. చిన్న టెక్నికల్ గ్లిచ్ కు దేవుడిపై నిందలు వేయడం సరికాదని, రాజమౌళి లాంటి స్థాయి ఉన్న వ్యక్తి సమాజానికి ఆదర్శంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్