అఖండ-2 సినిమా విడుదలకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

17చూసినవారు
అఖండ-2 సినిమా విడుదలకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబోలో వస్తున్న అఖండ-2 సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. రూ.28 కోట్ల బకాయిల కారణంగా మద్రాసు హైకోర్టు సినిమా విడుదలను నిలిపివేసింది. అయితే, సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్, ఈరోస్ ఇంటర్నేషనల్ మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ విడుదలకు అంగీకరించింది. దీంతో మద్రాసు హైకోర్టు సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.