
ఇరాన్ అణుకేంద్రం, మషద్పై అమెరికా దాడి!
కాసేపట్లో మషద్ నగరంలో అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరగనున్న నేపథ్యంలో అమెరికా దాడి చేసింది. ఉత్తర ఇరాన్లో చైనా, రష్యాతో వాణిజ్యానికి కీలకమైన రైల్వే బ్రిడ్జిపై దాడి జరిగినట్లు ఇరాన్ ప్రకటించింది. బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను కూడా అమెరికా లక్ష్యంగా చేసుకుందని ఇరాన్ వెల్లడించింది. ఈ ఆరోపణలపై అమెరికా ఇంకా స్పందించాల్సి ఉంది.


























