తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లో అత్యధికంగా 11.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేట, నిజామాబాద్, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. అటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు దంచికొట్టాయి.