Mar 16, 2026, 13:03 IST/
హైదరాబాద్, తెలంగాణలో భారీ వర్షాలు: వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
Mar 16, 2026, 13:03 IST
హైదరాబాద్లో ఈ రోజు రాత్రి పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. నగరంతో పాటు మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని తెలిపింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున 'ఎల్లో అలర్ట్' జారీ చేశారు. తెలంగాణలోని మరో 14 జిల్లాల్లోనూ వడగళ్ల వాన పడే సూచనలున్నాయి. రానున్న ఐదు రోజులు తెలంగాణ, ఏపీలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది.