Mar 10, 2026, 12:03 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం
మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టాలి: కలెక్టర్
Mar 10, 2026, 12:03 IST
మహబూబ్ నగర్ జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణాను కఠినంగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, గంజాయి, డ్రగ్స్ వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు.