
నాగర్ కర్నూల్: నిన్న గెలుపు.. అర్ధరాత్రి మృతి
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 7వ వార్డు సభ్యుడిగా కాంగ్రెస్ మద్దతుదారు మహేష్ విజయం సాధించారు. అయితే, ఎన్నికల ఫలితాలు వెలువడిన రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారు. దీంతో సోమవారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.







































