ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


హార్ముజ్ ఒప్పందం.. ఇరాన్ మీడియా ప్రచారాన్ని ఖండించిన అమెరికా
May 27, 2026, 16:05 IST/

హార్ముజ్ ఒప్పందం.. ఇరాన్ మీడియా ప్రచారాన్ని ఖండించిన అమెరికా

May 27, 2026, 16:05 IST
హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా-ఇరాన్ మధ్య ముసాయిదా ఒప్పందం కుదిరిందంటూ ఇరాన్ మీడియా ప్రచారం చేసింది. హార్ముజ్ దగ్గర అమెరికా దిగ్బంధాన్ని ఎత్తివేస్తోందని, ఇరాన్ కూడా హార్ముజ్‌ను తెరుస్తోందని వార్తలు వచ్చాయి. అయితే, ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రచారం చేసిన ఈ వార్తలను వైట్‌హౌస్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసిన అవగాహన ఒప్పందం (MoU) ముసాయిదా పూర్తిగా కల్పితమని అమెరికా స్పష్టం చేసింది. ఈ వార్తలతో అంతర్జాతీయ చమురు మార్కెట్లలో ధరలు పడిపోయినప్పటికీ, వైట్‌హౌస్ ఖండనతో తుది ఒప్పందం ఇంకా దూరంలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.