వంగూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ పాల విజయ డైరీ కి పాలు విక్రయించే రైతులకు ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రైతు వారీగా రైతుల ఖాతాల్లో పాల బిల్లులను జమ చేసినట్లు గురువారం డైరీ అధికారులు పేర్కొన్నారు. పాడి రైతులు ఎవరికైనా బిల్లులు జమ కాకపోతే తమ బ్యాంకు ఖాతా జిరాక్స్ లను అందజేయాలని రైతులకు సూచించారు. కారణాలు పరిశీలించి బిల్లులు జమ చేస్తామని పేర్కొన్నారు.