
అలంపూర్: ఎద్దుల బండ్లతో రైతుల నిరసన
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద ఆదివారం ఎద్దుల బండ్లతో నిరసన తెలిపారు. తుంగభద్ర నది నుండి ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్లతో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, కానీ ఎద్దుల బండ్లను మాత్రం అడ్డుకోవడం సరికాదని నిరసనకారులు ఆరోపించారు. ఎద్దుల బండ్లతో ఇసుక రవాణా చేస్తే అడ్డుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తూ వారు ధర్నా నిర్వహించారు.





































