అలంపూర్ లోని ప్రసిద్ధ షా అలీ పహిల్వాన్ దర్గా ఉరుసును పురస్కరించుకుని, స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ప్రభాకర్, ఎస్సై రామకృష్ణ, మున్సిపల్ చైర్మన్ పి జయరాముడు ఆధ్వర్యంలో ఉర్సు కమిటీ సభ్యులతో సమావేశం జరిగింది. ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాలను శాంతియుతంగా, మత సామరస్యంతో జరుపుకోవాలని ఎస్సై సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.