రాజోలిలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు

1009చూసినవారు
అలంపూర్ రాజోలి మండల కేంద్రంలోని ఆర్డీటీ కాలనీ ఎంబీ చర్చిలో ఆదివారం రాత్రి రెవరెండ్ పాస్టర్ దేవన్న ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవులు కొవ్వొత్తులు వెలిగించి, పాటలు పాడుతూ, ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ క్రీస్తును ఆరాధించారు. పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భంలో ఏసుక్రీస్తు జన్మించారని పాస్టర్ వివరించారు. ఈ వేడుకల్లో సంఘ పెద్దలు, మహిళలు, పురుషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్