
18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఓకే: గద్వాల కలెక్టర్
జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ నెల 11, 14, 17 తేదీల్లో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు 18 రకాల గుర్తింపు కార్డులను పరిగణనలోకి తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సంతోష్ బుధవారం ప్రకటించారు. ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, ఉపాధి హామీ జాబ్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఫోటోతో కూడిన కుల ధ్రువీకరణ పత్రాలు, పాస్ పోర్ట్, దివ్యాంగుల గుర్తింపు కార్డ్ వంటి వాటిని చూయించి ఓటు వేయవచ్చని తెలిపారు. ఈ ప్రకటన ఎన్నికల ప్రక్రియలో ఓటర్లకు స్పష్టతనిస్తుంది.






































