అలంపూర్ - Alampur

గద్వాల: ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవలు నిషేధం: ఎస్పీ

గద్వాల: ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవలు నిషేధం: ఎస్పీ

జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు గురువారం మాట్లాడుతూ, ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం మూడు దశల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లోనే కొనసాగుతుందని తెలిపారు. తొలి దశ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ, గెలిచిన అభ్యర్థులు లేదా వారి మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు, బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు, డీజేలు వంటి కార్యక్రమాలను నిర్వహించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. MCC అమల్లో ఉన్నంతకాలం ఈ ఆంక్షలను తప్పనిసరిగా పాటించాలని, నియమాలను అతిక్రమించే ఏ చర్యనైనా సహించబోమని, ఉల్లంఘనలు జరిగితే వెంటనే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

వీడియోలు


జోగులాంబ గద్వాల జిల్లా