Apr 10, 2026, 09:04 IST/
వారంలోనే ఖాతాల్లోకి డబ్బులు వేస్తాం: పొంగులేటి
Apr 10, 2026, 09:04 IST
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా చేగొమ్మలో గోదామును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు. కొందరు తమపై బురద జల్లాలని చూస్తున్నారని, అయితే ప్రజలు తమను మరోసారి దీవిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.