Mar 10, 2026, 18:03 IST/గద్వాల్
గద్వాల్
అలంపూర్: పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య
Mar 10, 2026, 18:03 IST
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన భరత్ కుమార్ అనే యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. విషయాన్ని గుర్తించిన వెంటనే అతడిని కర్నూలు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.