మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 60 డివిజన్లకు గాను 781 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి 328, బీఆర్ఎస్ నుంచి 153, బీజేపీ నుంచి 112, ఎంఐఎం నుంచి 28, జనసేన నుంచి 20, బీఎస్సీ నుంచి 8, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 3, ఆప్, సీపీఎం నుంచి ఇద్దరు చొప్పున నామినేషన్లు వేశారు. 125 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ నామినేషన్లను దాఖలు చేశారు.