నూతన కోనేటి జలాలతో అయ్యప్ప స్వామికి అభిషేకం

348చూసినవారు
నూతన కోనేటి జలాలతో అయ్యప్ప స్వామికి అభిషేకం
నారాయణపేట జిల్లా మక్తల్ అయ్యప్ప స్వామి దేవాలయం పదవ వార్షికోత్సవం సందర్భంగా, గురుస్వాములు అశోక్ గౌడ్, తాళంపల్లి అనిల్ ఆధ్వర్యంలో నూతనంగా పునరుద్ధరించబడిన కోనేటి నుండి పవిత్ర జలాలను తీసుకొని మేళ తాళాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఈ పవిత్ర జలాలతో అయ్యప్ప స్వామికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేస్తామని గురుస్వాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్తల్ సన్నిధానం స్వాములు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్