మహబూబ్‌నగర్ జిల్లా, దేవరకద్ర నియోజకవర్గంలోని కౌకుంట్ల మండల కేంద్రంలో 1981-82 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ
విద్యార్థులు సోమవారం ఒకే వేదికపై ఆత్మీయంగా కలుసుకున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత బాల్య మిత్రులు పరస్పరం కుశలప్రశ్నలు వేసుకుంటూ, పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. మృతి చెందిన సహచర మిత్రులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించి ఉద్యోగ విరమణ చేసిన సహచర మిత్రులను సత్కరించారు.