మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సర్పంచులను గెలిపిస్తే, ఎంపీ నిధుల నుంచి రూ. 10 లక్షలు కేటాయిస్తానని ఎంపీ డీకే అరుణ సోమవారం స్పష్టం చేశారు. గ్రామాల్లో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే జరుగుతుందని, పార్లమెంట్ సభ్యురాలిగా ఆయా గ్రామాల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఆమె తెలిపారు. అన్ని గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని ఆమె కోరారు.