రేపు పాలమూరులో సీఎం రేవంత్ పర్యటన

8చూసినవారు
రేపు పాలమూరులో సీఎం రేవంత్ పర్యటన
సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 4, 5 తేదీల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తారు. జూన్ 4న కోయిల్ సాగర్, ప్రియదర్శిని జూరాల, గూడెందొడ్డి, నార్లాపూర్ రిజర్వాయర్లను సందర్శించి, పనుల పురోగతి, భూసేకరణ, పునరావాస ప్రక్రియలపై సమీక్ష నిర్వహిస్తారు. జూన్ 5న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS) పనులు, సోమశిల, కల్వకుర్తి ఎత్తిపోతల, కుమ్మెర పంప్ హౌస్, ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించి, ఉయ్యాలవాడలో నూతన ఇరిగేషన్ సమీకృత కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

సంబంధిత పోస్ట్