జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మంగళవారం హన్వాడ, వేపూర్ గురుకుల బాలికల పాఠశాలలను సందర్శించి, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. పదో తరగతి పరీక్షలు జీవితంలో కీలకమని, భయం వీడి ఆత్మవిశ్వాసంతో రాయాలని విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు పోషకాహారం అందించాలని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.