బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన ఎంపీ డీకే అరుణ

1083చూసినవారు
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బీసీ రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని ఆదివారం ఆరోపించారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో బీసీలకు 21% రిజర్వేషన్లు కూడా అమలు చేయలేదని విమర్శించారు. బీసీలకు న్యాయం చేస్తున్న రేవంత్ పేరు రేవంత్ గౌడ్ అని పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారని, బీసీలకు ఎక్కడ న్యాయం చేశారన్నారు. కాంగ్రెస్ కేవలం బీసీలను వాడుకున్నారని ఆమె మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్