ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఉచిత శిక్షణకు నేటితో గడువు

3చూసినవారు
ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఉచిత శిక్షణకు నేటితో గడువు
మహబూబ్ నగర్ (MBNR): జిల్లాలోని ఎస్సీ స్టడీ సర్కిల్ నందు గ్రూప్-1, 2, 3 & 4, బ్యాంకింగ్, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ పరీక్షలకు 5 నెలల ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, డిగ్రీ అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు https://www.tsstudycircle.co.in వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి 5 నెలల పాటు ఉచిత భోజనం, వసతి, పుస్తకాలు, నిష్ణాతులైన అధ్యాపకులచే బోధన అందించబడుతుంది.