దేవరకద్ర: కురుమూర్తి జాతరలో చట్టాలపై అవగాహన

4చూసినవారు
దేవరకద్ర: కురుమూర్తి జాతరలో చట్టాలపై అవగాహన
దేవరకద్ర నియోజకవర్గం, చిన్నచింతకుంట మండలం, అమ్మాపురం శ్రీ కురుమూర్తి స్వామి జాతర మైదానంలో గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సివిల్ జడ్జి ఇందిరా గృహహింస, ఆస్తి హక్కులు, సమాచార హక్కు చట్టాలపై వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఓబుల్ రెడ్డి, ఆలయ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.