దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. శనివారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎద్దుల రాజు, జి. ఆంజనేయులు, ఉస్కిల రాములు, అంజయ్య, దొబ్బలి విజయ్, చిన్న, రాజు, దొబ్బలి వెంకటేష్, శేఖర్, దొబ్బలి రాములు, మొగులయ్య తదితరులు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో
కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి
కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసి కృషి చేస్తామని వారు తెలిపారు.