దేవరకద్ర: నీళ్ల వివాదం వెనకాల BRSది కుళ్ళు రాజకీయం: ఎమ్మెల్యే

3చూసినవారు
దేవరకద్ర: నీళ్ల వివాదం వెనకాల BRSది కుళ్ళు రాజకీయం: ఎమ్మెల్యే
దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి శుక్రవారం మాట్లాడుతూ, నీళ్ల వివాదం వెనుక బీఆర్ఎస్ పార్టీ కుళ్ళు, కుతంత్రాల రాజకీయాలు దాగి ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల్లో వరుసగా ఓడిపోతున్న బీఆర్ఎస్ పార్టీ, తమ మనుగడ కష్టమని భావించి జలవివాదాన్ని సృష్టిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంపై కేసీఆర్, హరీష్ రావు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందనే అపోహతో తమ పార్టీని బతికించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్