దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదివారం మహబూబ్ నగర్ జిల్లాలోని చిన్న చింతకుంట, లాల్కోట, పర్థిపూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో విద్యను నిర్లక్ష్యం చేసిందని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని, అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు. గ్రామాలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.