దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం పాలెం సమీపంలో జాతీయ రహదారి-44ను దాటుతున్న కొండన్న అనే వ్యక్తిని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో సోమవారం తీవ్ర గాయాలయ్యాయి. పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన కొండన్న రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుడిని వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.