జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా, బుధవారం ఎర్రగడ్డ డివిజన్ లోని శాస్త్రీ నగర్ లో మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్సీ రాములు నాయక్ లతో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి, నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు.