మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం లాల్ కోటలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాసులకు చెందిన మామిడి తోటలో మామిడికాయలు రాలిపోయాయి. ఈ నేపథ్యంలో చేతికి వచ్చిన మామిడి కాయలు రాలిపోయాయంటూ రైతు శ్రీనివాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.