మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. మూసాపేట మండలం తుకినీపూర్ గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అలాగే మూసాపేట మండల కేంద్రానికి చెందిన మైనారిటీ బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.