రాచాలలో భారీ పాము కలకలం

63చూసినవారు
రాచాలలో భారీ పాము కలకలం
దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకల్ మండలం రాచాలలో ఆదివారం భారీ పాము కలకలం సృష్టించింది. ఎస్సీ కాలనీలోని చేగుంట ఆంజనేయులు ఇంటి సమీపంలో పెద్ద పాము కనిపించడంతో కాలనీవాసులు భయాందోళనకు లోనయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు ఆ పామును చంపారు. పిల్లలు ఎక్కువగా ఆ ప్రాంతాల్లో తిరుగుతున్న కారణంగా పాముల వంటి విష పురుగుల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ఇంటింటికీ అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్