దేవరకద్ర: భారత్ అంటే ప్రపంచ దేశాలకు ఈర్ష్య: ఎంపీ డీకే అ

1చూసినవారు
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర మున్సిపాలిటీ, కౌకుంట్ల, చిన్నచింతకుంట, మూసాపేట మండలాల బీజేపీ కార్యకర్తల కోసం నిర్వహించిన 'పండిట్ దీన్ దయాల్ ప్రశిక్షణా మహాభియాన్' తరగతులకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధి చెందుతోందని, ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరిందని తెలిపారు. పార్టీ బలోపేతం కావాలంటే బూత్ స్థాయి నుండి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, క్రమశిక్షణతో కూడిన కార్యనిర్వాహణ పార్టీకి కీలకమని పేర్కొన్నారు. ఈ శిక్షణా తరగతులకు చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కొండ ప్రశాంత్ రెడ్డి కూడా హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్