దేవరకద్ర: యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యమే జాబ్ మేళా

1చూసినవారు
దేవరకద్ర: యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యమే జాబ్ మేళా
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాలో యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, కలెక్టర్ కుష్బూ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కార్పొరేట్ కంపెనీలతో చర్చించి ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసిందని, యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్