దేవరకద్ర గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి చెరువుల మట్టిని అక్రమంగా కర్వేన ప్రాజెక్టుకు తరలించి వందల కోట్లు దోచుకున్నారని బీజేపీ దేవరకద్ర ఇన్ఛార్జ్ కొండా ప్రశాంత్ రెడ్డి శనివారం ఆరోపించారు. భుత్పూర్ మండలం ముఖ్య కార్యకర్తల సమావేశంలో కొండా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి కాంట్రాక్టర్లను బెదిరించి పర్సంటేజీలు వసూలు చేస్తున్నారని విమర్శించారు.