దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండల శివారులో జాతీయ రహదారి-44పై శుక్రవారం సాయంత్రం కారు ప్రమాదం జరిగింది. నలుగురు పంచాయతీ కార్యదర్శులు గద్వాలలోని పెళ్లి వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా, అడ్డాకుల గ్రామానికి సమీపంలో కర్నూల్ నుండి హైదరాబాద్ వెళ్తున్న లారీ, హైవేపై ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సురక్షితంగా బయటపడగా, వేముల గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సతీష్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.