బుధవారం నారాయణపేట జిల్లా పర్యటనకు వెళుతున్న మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర మండలం గోప్లాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తన వాహనాన్ని ఆపి, ప్రమాదం జరిగిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, మంత్రి శ్రీహరి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.