మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం మదిగట్లలో ఎల్లమ్మ దేవర మహోత్సవాలలో శుక్రవారం రాత్రి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఎల్లమ్మ దేవరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ బండారు ధరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఎల్లమ్మ అమ్మవారి అనుగ్రహంతో నియోజకవర్గం అన్నిరంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.