ప్రజా పాలన వారోత్సవాల సందర్భంగా దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ కోసం శుక్రవారం సాయంత్రం ఏర్పాట్లను దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనను రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జియంఆర్ తెలిపారు.