దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం రావులపల్లిలో గ్రామస్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో 40 మందికి కుట్టు మిషన్లు గురువారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్వరాజ్య సంస్థ ఎన్జీవోస్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.